కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనాతో బాధపడుతున్నాడు. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయనను బెంగుళూరుకు తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు కరోనా బారినపడ్డారు. ఆయన కొంతకాలంగా చికిత్స తీసుకొంటున్నారు. అయితే అత్యవసర చికిత్స తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే దొరబాబును ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగుళూరుకు ఆదివారం నాడు తరలించారు. 

ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిదులు, పలు పార్టీల నేతలకు కూడ కరోనా సోకింది. చాలా మంది కరోనా నుండి కోలుకొన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్,  అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు,టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా సోకింది.

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన కరోనా నుండి కోలుకొన్నారు. మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా సోకింది. ఆయన కరోనా కోసం  చికిత్స తీసుకొంటున్నారు.