హనుమాన్ జంక్షన్ రెండవ ఎస్సై విజయకుమార్ రాసలీలల విషయం వెలుగు చూడటంతో మొత్తం పోలీసు యంత్రాంగమే అప్రమత్తమైంది

జనాలందరూ దసర పండుత బిజీలో ఉంటే విజయవాడకు కూతవేటు దూరంలోని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్ ఐ మాత్రం రాసలీలల్లో బిజీగా ఉన్నారు. హనుమాన్ జంక్షన్ రెండవ ఎస్సై విజయకుమార్ రాసలీలల విషయం వెలుగు చూడటంతో మొత్తం పోలీసు యంత్రాంగమే అప్రమత్తమైంది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఎస్సై. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నపుడు తీసుకున్న సెల్పీలు బయటకు పొక్కటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎప్పుడైతే విషయం బట్టబయలైందో కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి సీరియస్ అయ్యారు. వెంటనే ఎస్సైను వేకెన్సీ రిజర్వ్(విఆర్)లో పంపేసారు.