రోజువారి ధరల సవరణలతో అనేక సమస్యలు వస్తాయని అంటున్నాయి యాజమాన్యాలు. తమ ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోతే 16వ తేదీ నుండి పెట్రోలును కొనేది లేదు, అమ్మేది కూడా లేదంటూ తెగేసి చెప్పేసాయి.

రాష్ట్రంలోని పెట్రోలు బంకుల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే తాము పెట్రోలు, డీజల్ కొనేది లేదని స్పష్టంగా అల్టిమేటమ్ జారీ చేసాయి. ఈనెల 16వ తేదీ నుండి పెట్రోలు, డీజల్ ధరలను రోజువారి సవరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణియంచింది కదా? ఆ విషయంలోనే పెట్రోలు బంకుల యాజమాన్యాలు, కేంద్ర నిర్ణయంతో విభేదిస్తున్నాయి.

రోజువారి ధరల సవరణలతో అనేక సమస్యలు వస్తాయని అంటున్నాయి యాజమాన్యాలు. తమ ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోతే 16వ తేదీ నుండి పెట్రోలును కొనేది లేదు, అమ్మేది కూడా లేదంటూ తెగేసి చెప్పేసాయి. వీరి డిమాండ్లను గనుక కేంద్రం పట్టించుకోకపోతే మధ్యలో నష్టపోయేది జనాలే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల పెట్రోలు, డీజల్ బంకులున్నాయి. ఒక్కసారిగా అన్నీ బంకులూ మూసేస్తే జనాల పరిస్ధితి ఏంటో కేంద్రం ఆలోచించిందా?