అమరావతి: సాక్షి టీవీ ఛానెల్, పత్రికకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇస్తుదంటూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టు  ఇవాళ విచారణకు స్వీకరించింది.

సాక్షి పత్రికలో ప్రకటనలను వైసీపీ జెండా పోలిన రంగులతో ప్రచురిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్ పై  జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమా దేవి తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. మరో వైపు ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి బెంచీకి బదిలీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

ప్రభుత్వ డబ్బుతో ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. వైసీపీ రంగులో ప్రకటనలు ముద్రించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ రంగులతో ప్రకటనలు జారీ చేయడం ద్వారా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు.

ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వెళ్లనుంది.