కర్నూలు జిల్లా శెట్టివీడులో పాస్టర్ ప్రసన్నకుమార్ లైంగిక వేధింపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

కర్నూలు జిల్లాలో పాస్టర్ అరాచకాలపై పోలీసులు స్పందించారు. పాస్టర్ ప్రసన్న కుమార్ ను చాగలమర్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్ ను విచారిస్తున్నట్లు వెల్లడించారు. పాస్టర్ పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు.

కర్నూలు జిల్లా శెట్టివీడులో పాస్టర్ ప్రసన్నకుమార్ లైంగిక వేధింపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రేయర్ పేరుతో మైనర్ బాలికలను 
Sexually harassing చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల తల్లిదండ్రులు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపి Settlement చేసుకున్న విషయం బయటికి రావడంతో పోలీసులు స్పందించారు. బాధితులకు 50వేలు, పంచాయతీ పెద్దలకు 10వేలు, పోలీసులకు 5వేలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్న విషయం బయటపడింది. 

Pastor తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, బాధిత Minor girls బయటపెట్టారు. తమ పేరెంట్స్ కి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. పాస్టర్ చాలా మంది మీద లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని బాధితులు తెలిపారు. పాస్టర్ అరాచకాలమీద ఓ టీవీ ఛానల్ లో కథనాలు ప్రసారం కావడంతో పోలీసులు స్పందించారు. పాస్టర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

పెళ్లైన మూడు నెలలకే.. విహారానికి వెళ్లి నవవధువు మృతి..

ఇదిలా ఉండగా, సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రధానోపాధ్యాయుడు ఇలాంటి అకృత్యానికే తెగబడ్డాడు. ‘పట్టుకోండి చూద్దాం’ అనే ఆట పేరుతో బాలికల కళ్ళకు గంతలు కడతాడు. పిల్లలతో కలిపి తాను ఆడుతున్నట్లు గా నటిస్తూనే కళ్ళకు గంతలు కట్టి ఉన్న Girlsను ఏమార్చి.. Store roomలోకి తీసుకు వెళ్తాడు. 

అక్కడ వారిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఇప్పటివరకు నలుగురు చిన్నారులపై Sexual assaultకి పాల్పడినట్లు వారి తల్లిదండ్రుల ద్వారా తెలిసింది.

బాధితులంతా మూడు, నాలుగు తరగతి చదువుతున్న పిల్లలే. బడికి వెళ్లేందుకు ఆ చిన్నారులు భయపడుతుండటంతో వారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని Parents ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. నిందితుడు, అక్కడ Principalగా పనిచేస్తున్న అనిల్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.

చింతలపాలెం ఎస్సై రంజిత్ రెడ్డి, బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ. ఆ పాఠశాలలో ఎనిమిదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 28 ఏళ్ల అనిల్ కు గత ఏడాది పెళ్లయింది. మేళ్లచెరువు మండలం కేంద్రంలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. 

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఆ schoolలో 90 మంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉన్నాయి. ఒక స్టోర్ రూమ్ ఉంది. అక్కడ అనిల్ తో పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత ఉండటంతో 90 మంది పిల్లలను ఒకేచోట ఉంచి పాఠాలు చెబుతున్నారు.

మధ్యాహ్నం మూడు గంటల మధ్య విద్యార్థులతో ఆటలు ఆడించి ఇంటికి పంపుతున్నారు. గత పది రోజులుగా బాలికలపై అనిల్ లైంగిక దాడికి పాల్పడుతునట్లు గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.