పెళ్లైన మూడు నెలలకే.. విహారానికి వెళ్లి నవవధువు మృతి..
విశాఖ పాడేరులో విహార యాత్రలో విషాదం చోటు చేసుకోవడం అందర్నీ కలిచి వేస్తోంది. పాడేరు డివిజన్ పరిధిలో తాడేపల్లి చెక్ పోస్ట్ వద్ద కారు వెనుక నుంచి బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరింగిందని ప్రాథమిక సమాచారం.
పాడేరు : రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ప్రముఖ పర్యాటక కేంద్రమైన vanjangiకి newly married coupleతో పాటు వారి బంధువులు మూడు బైకుల మీద బయల్దేరారు.
వంతాడపల్లె చెక్ పోస్ట్ వద్దరు కాగానే నవ దంపతుల వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టడంతో accident అయ్యింది. ఈ ఘటనలో నవ వధువు హేమ (24) అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త తరుణ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో పాడేరు ఆస్పత్రికి తరలించారు. వీరికి మూడు నెలల కిందట వివాహం అయినట్లు సమాచారం.
విశాఖ పాడేరులో ఇలా విహార యాత్రలో విషాదం చోటు చేసుకోవడం అందర్నీ కలిచి వేస్తోంది. పాడేరు డివిజన్ పరిధిలో తాడేపల్లి చెక్ పోస్ట్ వద్ద కారు వెనుక నుంచి బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరింగిందని ప్రాథమిక సమాచారం.
ఇదిలా ఉండగా, ప్రకాశం జిల్లా సింగారయకొండలో సెప్టెంబర్ 10, శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. విహారయాత్రకు వచ్చి విషాదాన్ని కొనితెచ్చుకొన్నారు. సింగరాయకొండ మండలం పాకాలలోని పాకాల సముద్రంలో మునిగి ఇద్దరు మరణించారు. మరో నలుగురిని స్థానికలు రక్షించారు. వినాయకవతిని పురస్కరించుకొని ఆరుగురు స్నేహితులు Excursion కోసం పాకాల సముద్రానికి వచ్చారు.
Pakala samudramలో స్నానానికి దిగారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. మరో నలుగురు కూడ నీటిలో కొట్టుకుపోతున్నసమయంలో స్థానికులు వారిని కాపాడారు. మృతి చెందిన వారిని మర్రిపూడి మండలం చిమటకు చెందిన తేజ, శేఖర్ లు గుర్తించారు.
వినాయకచవితి రోజున స్నేహితులతో సంతోషంగా గడిపేందుకు వచ్చి ఇద్దరు మృత్యువాత పడడంతో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.పాకాల సముద్రంలో స్నానానికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
ఆగస్టులో జరిగిన ఇలాంటి మరో ఘటనలో నలుగురు బెంగళూరు వాసులు మృతి చెందారు. కడప జిల్లాలోన వెలిగల్లు ప్రాజెక్ట్ సమీపంలోని గండి మడుగులో కుటుంబంతో కలిసి సరాదాగా విహారయాత్రకు వెళ్ళిన నలుగురు బెంగళూరు వాసులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులే వుండటం మరింత విషాదకరం.
వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసముండే ఓ కుటుంబం సరదాగా విహారయాత్ర చేస్తోంది. పదిమంది కుటుంబసభ్యులు ఇలా వివిధ ప్రాంతాల్లో విహరిస్తూ చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో బంధువుల వద్దకు వచ్చారు. అక్కడ మరో పది మందితో కలిసి గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్ట్ సమీపంలోకి గండి మడుగు వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలోనే చిన్నారులు , మహ్మద్ హంజా(12), ఉస్మాన్ ఖానమ్(11), మహ్మద్ హఫీజ్(10)లు సరదాగా నీటిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునిగిపోగా వారిని కాపాడే ప్రయత్నం చేసిన తాజ్ మహ్మద్(40) కూడా నీటమునిగారు. ఇలా కుటుంబసభ్యులు తమ కళ్లెదుటే నీటమునుగుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం ఉండిపోయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని పోలీసులు తెలిపారు.