2050 నాటికి ప్రపంచంలో మూడు అగ్రశ్రేణి  ఆర్థిక వ్యవస్థలలో ఆంధ్రప్రదేశ్ ఒకటవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మధ్య  ప్రకటించారు.అంతే, ఆంధ్ర అంతర్జాతీయ బాట పట్టింది. సగటున భారతదేశం కంటే, చైనా కంటే కూడా ఆంధ్రలో ప్రజలు సంతోషంగా  ఉన్నారని ఒక అధ్యయనం తేల్చింది. తాజాగా విడుదలయిన  ప్రపంచ హ్యాపినెస్ ఇండెక్స్ లో  5368 స్కోరుతో ఆంధ్ర ప్రదేశ్,  చైనా (5,273 స్కోరు)  పాకిస్థాన్‌( 5,269 స్కోరు) లను తలదన్నింది 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలాంగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న చిత్తూరు జిల్లాలో ప్రజలేమంత సంతోషంగ లేరు. నేడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హ్యాపినెస్ ఇండెక్స్ లో చిత్తూరు జిల్లా పాతాళంలో ఉంది.

ఏపీలోని 13 జిల్లాలలో శ్రీకాకుళం జిల్లా సంతోష సూచికల్లో అగ్రస్థానంలో నిలిచింది. దాని తరువాతి స్థానం పశ్చిమగోదావరి జల్లాది. ఈ వరుసలో ప్రకాశం జిల్లా అట్టడుగున వుంది. చిత్తూరు జిల్లా 12వ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రిగా మూడో దఫా ఆయన ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, సంతోషానికి సంబంధించి, మోదీ గారి భారత దేశం కంటేనాయుడిగారి ఆంధ్ర ప్రదేశ్ చాలా ముందుంది. తాజాగా విడుదలయిన ప్రపంచ హ్యాపినెస్ సూచిక 2107 లో హ్యాపినెస్ కు సంబంధించి భారత దేశానికి 122వ ర్యాంక్ రాగా, ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయి అధికంగా వుంది, 72 వ ర్యాంకుతో.

విశ్వవ్యాప్తంగా 155 దేశాలలో అధ్యయనం చేసి ఆయా దేశాలలో సంతోష స్థాయిని అనుసరించి 2017 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌ను వెలువరించింది. సంతోష సూచిక స్థాయిలో మన దేశంకంటే పాకిస్థాన్ మెరుగు. 80వ ర్యాంకుతో ఉంది. భూటాన్ 97వ ర్యాంకుతో, నేపాల్ 99 వ ర్యాంకుతో, బంగ్లాదేశ్ 110 వ ర్యాంకుతో, శ్రీలంక 120 ర్యాంకుతో మెరుగైన స్థితిలో ఉన్నాయి.

వాస్తవానికి దేశ స్థాయి కంటే ఎక్కువగా సంతోషంలో ఎక్కువ మార్కులు సంపాదించి ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటిటించింది.

“ఆంధ్రప్రదేశ్ సాధించిన హ్యాపీనెస్ స్కోర్ 5,368. ఇదే సమయంలో సంతోషంలో భారత్ స్కోర్ 4,315 మాత్రమే. ఎపి స్కోర్ ర్యాంక్ 72తో సమానం. అంటే దేశం సాధించిన సంతోష సూచిక పాయింట్ల కంటే ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయి ఎంతో అధికం. సంతోష సూచికలో ఆంధ్రప్రదేశ్, 5,273 స్కోరుతో ఉన్న చైనాను. 5,269 స్కోరు సాధించిన పాకిస్థాన్‌ను, 5,011 స్కోరు వచ్చిన భూటాన్‌ను, 4,962 స్కోరుతో ఉన్న నేపాల్‌ను అధిగమించడం మరో విశేషం.,” అని ముఖ్యమంత్రి కమ్యూనికేషన్ అడ్వయిజర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ర్యాంకుల కోసం మన రాష్ట్రంలో 13 జిల్లాలలో 17,800 మంది జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశారు.

జిల్లాల వారీగా సంతోష సూచిక స్కోరు

 జిల్లా హ్యాపీనెస్ స్కోర్

శ్రీకాకుళం 6.414

పశ్చిమ గోదావరి 6.067

కృష్ణా 5.764

నెల్లూరు 5.720

తూర్పు గోదావరి 5.672

గుంటూరు 5.515

విజయనగరం 5.370

ఆంధ్రప్రదేశ్ 5.368

విశాఖపట్నం 5.053

అనంతపురము 4.966

కడప 4.867

కర్నూలు 4.775

చిత్తూరు 4.751

ప్రకాశం 4.679