త్వరలో పవన్ ‘ప్రజాయాత్ర’

First Published 21, Nov 2017, 7:31 AM IST
Pawankalyan dedided to start prajayatra  soon
Highlights
  • త్వరలో జనసేనాని కూడా ప్రజాయాత్ర మొదలుపెట్టనున్నారు.

త్వరలో జనసేనాని కూడా ప్రజాయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈయాత్రను పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాల్లో చేయాలని నిర్ణయించటమే విశేషం. ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా త్వరలో జనంబాట పట్టనున్నారు. ఎప్పటి నుండి అన్నదే ఇంకా నిర్ణయం కాలేదు. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన పవన్ ముఖ్య నేతలతో సమావేశమైనపుడు ఈ విషయం నిర్ణయమైంది.. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకోవాలంటే రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటించటం ఒకటే మార్గమని పవన్ భావిస్తున్నారు. అయితే, పాదయాత్రా లేకపోతే బస్సుయాత్ర చేయాలా అన్న విషయం ఇంకా నిర్ణయం కాలేదు. ప్రజల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్న తర్వాత పార్టీ ప్లీనరీ నిర్వహిస్తే ప్రజా సమస్యలకు కృషి చేసే అవకాశం ఉంటుందన్న పవన్ సూచనతో ముఖ్య నేతలు కూడా అంగీకరించారు. వచ్చేఆరు నెలల్లో పూర్తిగా పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించారు. పనిలో పనిగా పార్టీ సభ్యత్వాన్ని కూడా ఉధృత్వం చేయాలని నిర్ణయమైంది.

loader