అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పూర్తిస్ధాయిలో అడుగుపెట్టనున్నట్లు వపర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటి వరకూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నా ఇటీవల సంఘటనలపై స్పందించలేదన్నారు. జనసేన పార్టీ యంత్రాంగానికి సంబంధించి మిగిలిపోయిన జిల్లాల్లో జనసేనను తయారు అవుతుందన్నారు
ఎక్కడా కనబడటం లేదని, వినబడటం లేదని పవన్ గురించి చెప్పే వాళ్లకు పవన్ కల్యాణ్ గట్టి సమాధానమే చెప్పారు. అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పూర్తిస్ధాయిలో అడుగుపెట్టనున్నట్లు వపర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఉద్ధానం సమస్యపై చంద్రబాబునాయుడు, హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రఫొసర్ జోసెఫ్ తదితరులతో సోమవారం సమావేశం జరిగింది. తర్వాత అదే విషయమై పవన్ మీడియాతో మాట్లాడుతూ, చివరగా రాజకీయాలపైన కూడా మాట్లాడారు. అప్పుడే అక్టోబర్ నుండి రంగంలోకి దిగుతున్నట్లు వివరించారు.
రాజకీయాల్లో తానెక్కడా కనిపించటం లేదని విమర్శలు వస్తున్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఇప్పటి వరకూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నా ఇటీవల సంఘటనలపై స్పందించలేదన్నారు. జనసేన పార్టీ యంత్రాంగానికి సంబంధించి మిగిలిపోయిన జిల్లాల్లో జనసేనను తయారు అవుతుందన్నారు. అలా చెబుతూనే, వచ్చే అక్టోబర్ నుండి పూర్తిస్ధాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నట్లు చెప్పారు. అప్పటికి తన సినిమాలు కూడా పూర్తయిపోతాయన్నారు. కాబట్టి ప్రజా సమస్యలపైన, జనాల్లోనే మూడొంతుల సమయాన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, ఆగస్టులో జరుగనున్న నంద్యాల ఉపఎన్నిక అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.
నంద్యాల ఎన్నికలో జనసేన పాత్రపై పలురకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలో జనసేన పోటీ చేస్తుందా లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అన్న విషయమై క్లారిటీ ఇవ్వకపోవటంతో నెటిజన్లు పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఆ విషయమై పవన్ మాత్రం నోరిప్పలేదు.
