హార్వర్డ్ విశ్వవిద్యాలయంనుండి సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది.
సమాజాభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకునేందుకు రావాల్సిందిగా సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంనుండి సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. ‘ఇండియన్ కాన్ఫరెన్స్-2017’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే పవన్ కు కూడా ఆహ్వానం అందింది.
ఫిబ్రవరిలో జరుగనున్న రెండు రోజుల కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. ఫిబ్రవరి 11-13 మధ్య బోస్టన్ లోని హార్వర్డ్ విశ్వవిద్యా లయంలో జరిగే కార్యక్రమాలకు పవన్ హాజరవ్వనున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న కాటమరాయుడు షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి అందరికీ విధితమే.
