జనసేనకు మొత్తానికి కొత్త కార్యాలయం ఏర్పాటైంది. ముందస్తు ఎన్నికల వాతావరణం సందడి చేస్తున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.

పార్టీలోని కీలక వ్యక్తులు, సినీఫీల్డ్ కు చెందిన అతికొద్దిమందిని మాత్రమే పిలిచారు.

2014 ఎన్నికలకు ముందు పార్టీని పెట్టిన పవన్ మూడేళ్ళ తర్వాత పార్టీకి అధికారిక కార్యాలయం ప్రారంభించటం గమనార్హం.

మంగళవారం సాయంత్రం కార్యాలయంలో సంప్రదాయబద్దంగా ‘భరతమాత’ కు పూజలు చేసి కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.

కొత్త కార్యాలయంలో పవన్ కు పెద్ద ఛాంబర్, సమావేశ గదులు, విజిటర్స్ లాంజ్ లు, పార్టీ ముఖ్యులకు కూడా విడిగా గదులున్నాయి.