ఇదీ పవన్ కళ్యాణ్ అంటే.!

Pawan says this farmers fights for fundamental rights
Highlights

ఇదీ పవన్ కళ్యాణ్ అంటే.!

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే భూకబ్జాలకు అండగా ఉంటోందని విమర్శించారు. రాజధాని భూములపైనా పవన్ స్పందించారు. ఏపీ సీనియర్ రాజకీయ నాయకులు తమ దోపిడీలను ఆపాలి.. వెనుకబడిన ఉత్తరాంధ్రను ఇంకా శాశ్వతంగా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తూ కాలుష్యకారక పరిశ్రమలను ఏర్పాటుచేసి దాన్ని ఓ డంపింగ్ యార్డుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ రైతుకు సోంపేట ధర్మల్ పవర్ ప్లాంట్ పోరాటం సందర్భంగా బుల్లెట్ గాయం అయ్యింది. కానీ అతను ఆ బాధను లెక్కచేయకుండా తన ప్రాథమిక హక్కుల కోసం మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. 
 

loader