అమరావతి: తమ పార్టీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ పార్టీ మద్దతుదారుల 400 ఖాతాలు ఎందుకు నిలిపేశారో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

తమ పార్టీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ పై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిస్సహాయుల పక్షాన నిలబడడమే దానికి కారణమా అని ఆయన ప్రశ్నించారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడిగారు. జనసేన సోషల్ మీడియాను వెనక్కి తీసుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వార్ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కూడా జనసైనికులు విరివిగా ట్విట్టర్ వేదికగా ప్రచారం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. 

తమ పార్టీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ వ్యవహారంలో అధికార పార్టీల హస్తం ఉందని జనసైనికులు విమర్శిస్తున్నారు. కావాలనే వాటిని సస్పెండ్ చేయించాయని వారు అంటున్నారు.

 

సంబంధిత వార్త

కేసీఆర్, జగన్ లపై పోరు: జనసేన ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్, ఆందోళన