విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం జిల్లాలో తన ప్రజా పోరాట యాత్రను కొనసాగించనున్నారు. రంజాన్ పర్వదినం నేపత్యంలో తన యాత్రకు ఇటీవల ఆయన విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆయన ఈ నెల 23, 25 తేదీల్లో విజయవాడలో ఉంటారని, 25 సాయంత్రం విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని సమాచారం. మర్నాడు అంటే జూన్ 26వ తేదీ నుంచి విశాఖపట్నం జిల్లాలో తన యాత్రను కొనసాగించే అవకాశం ఉంది. 

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం ఆయన 3,4 రోజుల పాటు పర్యటిస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన తన యాత్రను సాగించాలని ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్రకారమే ఆయన యాత్ర సాగుతుందని అంటున్నారు.