Asianet News TeluguAsianet News Telugu

ఉమ్మడి సిఎం అభ్యర్థి పవన్ కల్యాణ్: తణుకులో గర్జించిన జనసేనాని

సోమవారం విజయవాడలో వామపక్షాలు, జనసేన ముఖ్యనేతల భేటీ అవుతున్నారు. ఈ భేటీలో వామపక్షాలు, జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆదివారం సభ నిర్వహించారు. 

Pawan Kalyan will be CM candiadate
Author
Tanuku, First Published Aug 12, 2018, 9:34 PM IST

రాజమండ్రి: వామపక్షాలు, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  చెప్పారు. సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 15న విజయవాడలో మహాగర్జన, హిందూపురం, ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్రలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 

సోమవారం విజయవాడలో వామపక్షాలు, జనసేన ముఖ్యనేతల భేటీ అవుతున్నారు. ఈ భేటీలో వామపక్షాలు, జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆదివారం సభ నిర్వహించారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 15 సీట్లు రావడానికి ప్రధాన కారణం తమ పార్టీయేనని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తణుకు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన జిల్లా ప్రజలను మోసం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, మన డబ్బుతో మన ఓట్లనే కొని.. మనల్నే టీడీపీ నేతలు దోచేస్తున్నారని  విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios