కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తిత్లీ తుఫాన్ పై తాను కేంద్రానికి లేఖ రాయలేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పవన్. తాను కేంద్రానికి రాసిన లేఖలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇవిగో ఆధారాలంటూ విరుచుకుపడ్డారు.

చంద్రబాబునాయుడు మీడియా మొత్తాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకొని వాస్తవాలను బయటకు రానియ్యకుండా చేస్తున్నారని జనసేనాని పవన్ ఆరోపించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా తిత్లీ బాధితుల చెక్కుల పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ ఒక్క లేఖ కూడా కేంద్రానికి రాయలేదని విమర్శించారు. 

ఉద్ధానం వచ్చి మొసలి కన్నీరు కార్చుతూ చాలా అన్యాయం జరిగిందన్న పవన్‌, తుఫాన్‌ బాధితుల గురించి కేంద్రానికి ఒక్క లేఖ అయినా రాశారా? పోనీ విమర్శించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.  

చంద్రబాబు విమర్శలపై మంగళవారం పవన్‌ కళ్యాణ్‌  ట్విటర్‌ వేదికగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు గారు.. ఏపీలోని ఎలాక్ట్రానిక్‌ మీడియా మొత్తం మీ కంట్రోల్‌లో ఉంది. కావును జనసేన వార్తలను బయటకు రావు. 

అందుకే మీరు మమ్మల్ని ప్రజల్లో దూషిస్తున్నారు. నేను తిత్లీపై కేంద్రానికి లేఖ రాయలేదని ప్రజలకు చెప్పారుగా.. ఇవిగో ఆధారాలు ’  అంటూ ప్రధానమంత్రికి రాసిన లేఖలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు పవన్ కళ్యాణ్.  

 

ఈ వార్తలు కూడా చదవండి

కుల రాజకీయాలు చేసే పార్టీ కాదు,కులాలను కలిపే పార్టీ జనసేన:పవన్

నేను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు: తిత్లీపై బాబుకు పవన్ కౌంటర్​​​​​​​

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్