పండిట్ రవిశంకర్ చొరవకు తాను మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనతో కలిసి లక్షలాదిగా ధ్యానంలో పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా పవన్ పిలుపునిచ్చారు.

Also Read లాక్ డౌన్: వైఎస్ జగన్ కు టైమ్ ఇచ్చిన పవన్ కల్యాణ్...

 ‘‘గొప్ప మానవతావాది అయిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురదేవ్ రవిశంకర్ గారి చొరవరకు మనస్పూర్తిగా నా మద్దతు తెలుపుతున్నా. ఈ కల్లోల సమయాన్ని ప్రతిఒక్కరూ ధృడ సంకల్పంతో అధిగమించగలరని కోరుకుంటూ.. రవిశంకర్ గారితో కలిసి లక్షలాదిగా ధ్యానంలో పాల్గొనాలని కోరుతున్నా’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా కేసులు 6వేలకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ.. కేసులు పెరుగుతండటం గమనార్హం. ఈ నేపథ్యంలో.. లాక్ డౌన్ మరింత పొడిగించాలని పలువురు భావిస్తున్నారు. ఒడిశాలో ఇప్పటికే లాక ్ డౌన్ పొడిగించారు కూడా. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ఈ నెల 30 వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రెండు రోజుల్లో ప్రధాని మోదీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.