మా పొలాల్లోకి వెళ్లాలంటే ఆధార్ అడుగుతున్నారు: పవన్‌తో రాజధాని రైతులు

pawan kalyan tour in amaravathi
Highlights

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలో పర్యటిస్తున్నారు.. దీనిలో భాగంగా ఉండవల్లిలో పొలాలను పరిశీలించారు.. అనంతరం రైతులతో సమావేశమై.. వారి సమస్యలు తెలుసుకున్నారు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలో పర్యటిస్తున్నారు.. దీనిలో భాగంగా ఉండవల్లిలో పొలాలను పరిశీలించారు.. అనంతరం రైతులతో సమావేశమై.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు కూడా ఆధార్ కార్డ్ చూపించాల్సి వస్తోందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..

కొన్నేళ్లుగా నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని.. ఏ క్షణాన తమ భూములు లాక్కొంటున్నారని భయపడుతున్నామని.. ఈ భూముల్లో పంటలు పండటం లేదంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని.. నాడు చెప్పుల్లేకుండా వచ్చి.. ఓట్లను అడిగిన చంద్రబాబు.. నేడు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని గెంటేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడిన పవన్.. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని.. పొలాల్లో 144 సెక్షన్ గురించి తాను డీజీపీతో మాట్లాడుతానని చెప్పారు.

loader