టార్గెట్ సీఎం సొంత జిల్లా

Pawan Kalyan targets cm  district
Highlights

పవన్ దూకుడు పెంచారు

సీఎం సొంత జిల్లా చిత్తూరులో శెట్టిపల్లి బాధితుల పక్షాన నిలిచిన పవన్.. ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తే తిరగబడతా మంటూ హెచ్చరించారు. విశాఖ నుంచి బస్సు యాత్రకు సిద్ధమౌతున్న పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా సీఎం సొంత జిల్లాలో నిర్వాసితులకు, భూములు కోల్పోయిన రైతులకు బాసటగా నిలిచిన పవన్ .. 13జిల్లాల్లోనూ ఇదే తరహా పోరాటాలకు సిద్ధమౌతున్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పవన్ దూకుడు పెంచారు. 5 రోజులుగా  జిల్లాలో పర్యటిస్తున్న పవన్. ప్రజలకు అన్యాయం చేస్తే జనసేన సహించదని, పేదల భూముల జోలికొస్తే ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరించారు పవన్.

త్వరలో రాష్ర్టవ్యాప్త పర్యటనకు సిద్ధమౌతున్న పవన్.. అంతకుముందే..సీఎం సొంతజిల్లాలో భూ నిర్వాసితుల సమస్యలపై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశమైంది. గత కొంత కాలంగా ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్న పవన్.. చిత్తూరు జిల్లా నుంచే అది మొదలు పెట్టారని ..13 జిల్లాలోనూ భూముల దందాపైన పవన్ పోరాడుతారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. 

loader