రంపచోడవరం: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్నీ దోచేస్తారంటూ విరుచుకుపడ్డారు.  రంపచోడవంరలో జనసేన నిర్వహించిన బహిరంగ సభలో పవన్ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే బాక్సైట్‌ ఖనిజాన్ని దోచేస్తారని ఆరోపించారు. 

జగన్‌ చట్టసభలకు వెళ్లకుండా రోడ్ల వెంట తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా భయపడి రోడ్లపై తిరుగుతన్నాడని ధ్వజమెత్తారు. జనసేన అధికారంలోకి వస్తే రంపచోడవరంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. 

అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏజెన్సీలో పలు నీటి ప్రాజెక్టుల నిర్వాసితులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం నుంచి పల్లె వెలుగు బస్సులో పవన్ కళ్యాణ్ సామాన్యుడితో కలిసి ప్రయాణించారు. బస్సులో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

పల్లెవెలుగులో ఏజెన్సీకి పవన్ కళ్యాణ్