పెద్దాపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. దేవుడని నమ్మితే దెయ్యమై కూర్చునట్లు చంద్రబాబు పరిస్థితి ఉందని మండిడ్డారు. ప్రజా పోరాటయాత్రలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్న ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. 

కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడు అవసరమని నాడు చంద్రబాబుకు మద్దతిచ్చానన్నారు. అయితే పాలనలో అభివృద్ధి కంటే అవినీతిపై అనుభవం పెంచుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవినీతిని చూడలేక ప్రశ్నించేందుకే జనసేన పార్టీని స్థాపించానని స్పష్టం చేశారు. 

ఒక్క సూరంపాలెంలోనే దళితులకు ఇచ్చిన పొలాలను లాక్కొని మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ మట్టి తవ్వకాలతో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అవినీతికి  పాల్పడితే చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కాకుండానే దొడ్డిదారిన ఎమ్మెల్సీ సంపాదించి మంత్రి అయిన యనమల రామకృష్ణుడు, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అవినీతికి పాల్పడుతుంటే చోద్యం చూస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ఏ మాత్రం వాటాలున్నాయో అర్థమవుతోందన్నారు. 

సూరంపాలెం గ్రామంలో దళితులకిచ్చిన దాదాపు 470 ఎకరాల పంట పొలాలను నిర్వీర్యం చేసి మట్టి వ్యాపారం చేసుకున్న చంద్రబాబు, లోకేష్, మంత్రులు రాజప్ప, యనమల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని నిప్పులు చెరిగారు. 

రూ.2వేల కోట్ల అవినీతిని నిరూపించడానికి సాక్ష్యాధారాలతో సహా వస్తానని మంత్రులు లోకేష్, రాజప్ప, యనమల సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 2019లో మాత్రం టీడీపీ  అధికారంలోకి రాదని పవన్‌ జోస్యం చెప్పారు. అవినీతిని ప్రోత్సహించే అధికార పార్టీ నాయకులు దీపావళి టపాసుల్లా పేలిపోతారని, అవినీతి బుద్ధి మార్చుకోకుంటే వారి పాపాలకు చరమగీతం పాడుతామన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కేంద్రానికి లేఖ రాశా, ఇవిగో ఆధారాలు:చంద్రబాబుకు పవన్ కౌంటర్

కుల రాజకీయాలు చేసే పార్టీ కాదు,కులాలను కలిపే పార్టీ జనసేన:పవన్

నేను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు: తిత్లీపై బాబుకు పవన్ కౌంటర్

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్