ఓటమి లోతుల్లో నుంచి ఉదయించిని పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు పెట్టిన పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. జనసేన కుల రాజకీయాలు చేసే పార్టీ కాదని కులాలను కలిపే పార్టీ అని పవన్ చెప్పుకొచ్చారు. 

రాజకీయాల్లోకి మార్పుకోసం వచ్చామని తెలిపారు. 25ఏళ్ల యువతను మేల్కొల్పనున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో జనసేన మరో కురుక్షేత్ర యుద్ధం చేస్తోందని చెప్పుకొచ్చారు. ధర్మం గెలిచే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

తుఫాన్ వల్ల ఉద్యానవనం లాంటి ఉద్దానం సర్వ నాశనం అయ్యిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల వలసలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలా ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను విమర్శించడానికి రాలేదని సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో చూడటానికి ప్రజలను ఓదార్చడానికి వచ్చానని పవన్ తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్