బాబు వినడం లేదు, కేసీఆర్ తో మాట్లాడుతా: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he will speak with KCR
Highlights

హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాంధ్రుల సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు దృష్టికి తీసుకుని వెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

విజయనగరం: హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాంధ్రుల సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు దృష్టికి తీసుకుని వెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 23 వెనకబడిన కులాలను ఓసీల్లో చేర్చిందనిస దీనివల్ల ఉత్తరాంధ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు.  

ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన అన్నారు. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన చెప్పారు. 
బీసీలను జనరల్ కేటగరిలో చేర్చడం వల్ల ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోనే వచ్చానని, తన బిడ్డలు ఎలా ఉంటారో అందరి బిడ్డలు అలాగే ఉండాలని కోరుకునే వాడిని ఆయన అన్నారు

విజయనగరం జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ సోమవారం ఎస్.కోటలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

loader