జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారా..? అవును మీరు చదవింది నిజమే. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆయనే స్వయంగా వివరించారు.

రానున్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పవన్ ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ పర్యటనలో ఆయన విస్తుపోయే నిజాలను వెల్లడించారు. గతంలో తాను ఎదుర్కొన్న పలు విషయాలను ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పంచుకున్నారు.

తాను‌ నటించిన ‘సుస్వాగతం’ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన సంఘటన గురించి వెల్లడించారు. ‘సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో నాకు బిడియం ఎక్కువగా ఉండేది. ‘సుస్వాగతం’ సినిమా చేస్తున్న సమయంలో నాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. బస్సుపైకి ఎక్కి వేలాది మంది చూస్తుండగా డ్యాన్స్‌ చేయాలని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. ఏం చేయాలో తెలీక మా వదిన సురేఖకు ఫోన్‌ చేశా. నేను సినిమాలో నటించడానికి సరిపోనని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను’ అని వెల్లడించారు పవన్‌.

ఆఖరిగా ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ ఇప్పుడు తన రాజకీయ ప్రయాణంపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. అప్పుడప్పుడూ ఆడియో, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు అతిథిగా హాజరవుతూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు.