ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

First Published 1, Jan 2019, 12:51 PM IST
pawan kalyan says election campaign starts from amaravathi
Highlights

తాను ఇకపై అమరావతిలోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

అమరావతి: తాను ఇకపై అమరావతిలోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

ఇకపై తాను అమరావతిలోనే ఉంటానని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలకు ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి నూతన రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఏపీలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాలి అంటే జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచెయ్యాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బంగారు భవిష్యత్ ఒక్క జనసేన మాత్రమే ఇస్తుందని ఆ విషయాన్ని జనసైనికులు ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని కోరారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

తెలుగు ప్రజలకు పవన్ న్యూ ఇయర్ విషెస్

loader