Asianet News TeluguAsianet News Telugu

కారణమిదే: వెస్ట్‌ నేతలతో భేటీ కానున్న జనసేనాని

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు భీమవరంలో సమావేశం కానున్నారు. ప్రత్యేక హోదాతో పాటు, టీడీపీ అవలంభించిన విధానాలను నిరసిస్తూ వైసీపీ మంగళవారం నాడు బంద్‌‌కు పిలుపునిచ్చింది.

Pawan kalyan plans yatra in west godavari district

 
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు భీమవరంలో సమావేశం కానున్నారు. ప్రత్యేక హోదాతో పాటు, టీడీపీ అవలంభించిన విధానాలను నిరసిస్తూ వైసీపీ మంగళవారం నాడు బంద్‌‌కు పిలుపునిచ్చింది. బంద్ రోజున పవన్ కళ్యాణ్ భీమవరంలో  పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

సోమవారం సాయంత్రం  పవన్ కళ్యాణ్  భీమవరం చేరుకొంటారని  పార్టీ వర్గాలు తెలిపాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వపన్ కళ్యాణ్ పర్యటించాలని భావిస్తున్నారు. మంగళవారం నాడు పవన్ కళ్యాణ్  పార్టీ నేతలతో సమావేశమైన సమయంలో ఈ విషయమై చర్చించనున్నారు.

ఆదివారం నాడు పశ్చిమగోదావరి జిల్లా నేతలు   పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు భీమవరంలో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టు సమాచారం. దీంతో భీమవరంలో  పవన్ కళ్యాణ్‌తో సమావేశానికి వెస్ట్ గోదావరి జిల్లా జనసేన నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాలో పర్యటనకు సంబంధించి నేతలతో చర్చించిన తర్వాతే   నియోజకవర్గాల వారీగా  పర్యటనను ఖరారు చేయాలని  పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించి జిల్లా నేతలతో చర్చించిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. 

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో  వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతోంది.అంతకు ముందే  పశ్చిమగోదావరి జిల్లాలో జగన్  పాదయాత్ర సాగింది.పవన్ కూడ త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించనున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios