మండపేట: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చేశారు. అసెంబ్లీలో తమ సమస్యలపై పోరాడాలని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి ఒక హోదా ఇస్తే జగన్ వాటిని పట్టించుకోకుండా భయపడి పారిపోతున్నారన్నారు. 

తన ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు సంతలో పశువుల్లా కొనేసారని చెప్తూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను ఆపుకోలేని వ్యక్తి రాజకీయాలు ఎందుకు అని నిలదీశారు. వైఎస్ జగన్ తప్పుకో నేను వస్తా నేను చూసుకుంటానని సవాల్ విసిరారు. 
 
జగన్ స్థానంలో తాను ఉంటే భయపడి రోడ్లపై వెళ్లేవాడిని కాదని ఎమ్మెల్యేలు అంతా అమ్ముడుపోయినా తాను వెనకడుగు వెయ్యనని ఒక్కడినే అయినా అసెంబ్లీకి వెళ్తానన్నారు. అంతేకానీ జగన్ లా భయపడి రోడ్డున పడనన్నారు. 

జనసేనకు ఒక ఎమ్మెల్యే లేడు. ఎంపీ లేడు. కనీసం వార్డు నెంబర్ కూడా లేడు. నేను ఎక్కడికి అయినా వెళ్లగలను. గుండె నిండా ధైర్యం ఉంది. దమ్ము ఉంది. ఎక్కడికైనా తాను వెళ్లగలను, పోరాటం చెయ్యగలను అని స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయాలంటే బుగ్గలు నిమరడం, తల నిమరడం కాదు: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్