ఆయనకి ముగ్గురు పెళ్లాలు, నాకు ఒక్కతే భార్య: పవన్ పై జగన్ సెటైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మహిళల భద్రత బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మహిళా భద్రత బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మహిళల భద్రత బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మహిళా భద్రత బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది పెద్దపెద్ద నాయకులు ఒక భార్య సరిపోదు ఇద్దరు సరిపోరు ఆఖరికి ముగ్గురు సరిపోరు నలుగురు కావాలి పెళ్లాలు అంటున్నారంటూ సెటైర్లు వేశారు. దాన్ని బిగమీ అంటారని జగన్ చెప్పుకొచ్చారు.
ఈ బిగమీ కింద ఏపీలో కూడా భారీగానే కేసులు నమోదు అయినట్లు జగన్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయని గుర్తు చేశారు. ఇకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు విపరీతంగా జరిగాయని జగన్ చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2018 వరకు మహిళలపై జరిగిన దారుణాలను లెక్కలతో సహా అసెంబ్లీలో చర్చించారు జగన్.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తాము ఎత్తిచూపుతామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేశారంటూ విరుచుకుపడ్డారు సీఎం జగన్.
లోకేష్ పప్పులో ఉల్లి లేదనే చంద్రబాబు బాధ: బాలకృష్ణపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా
తమ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని విమర్శించారు. మహిళల భద్రతకు సంబంధించి చట్టాన్ని తీసుకురావాలి దానిపై విలువైన సూచనలు ఇవ్వాలని కోరితే తమ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేలా చంద్రబాబు ఆరాటపడ్డారని విమర్శించారు.
తాను ముఖ్యమంత్రి అయిన ఆర్నెళ్ల కాలంలో రాష్ట్రంలో మహిళలపైనా, చిన్నారులపైనా జరుగుతున్న దారుణాలు తనను కలచివేశాయని జగన్ చెప్పుకొచ్చారు. నిందితులకు శిక్షలు పడటం లేదని తాను భావించానని ఇకపై చట్టాల్లో మార్పులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు జగన్.
మహిళలపై దారుణాలను అరికట్టాలన్నదే తన ముందు ఉన్న లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యురాలు దిశపై రేప్, అత్యాచార ఘటనను గుర్తు చేస్తూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నా దగ్గరకు వస్తున్నారు సీటు మార్చండన్న వైసీపీ ఎమ్మెల్యే : జగన్ నవ్వులు
సమాజం తలదించుకునేలా దిశ ఘటన చోటు చేసుకుందన్నారు జగన్. దిశపై జరిగిన దారుణం తనను కలచివేసిందని జగన్ చెప్పుకొచ్చారు. దిశలాంటి ఘటన ఏపీలో జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
నిందితులను ఎన్ కౌంటర్ చేయడంలో ఎలాంటి తప్పులేదన్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ ఇద్దరు కూడా ఆడపిల్లలేనని జగన్ చెప్పుకొచ్చారు. తనకు ఒక చెల్లి కూడా ఉందని సభలో స్పష్టం చేశారు. తనకు భార్య ఉందని చెప్పిన జగన్ వెంటనే ఒక్కతే భార్య అంటూ పవన్ పై మరో సెటైర్ వేశారు సీఎం జగన్.
ఒక ఆడపిల్లకు ఏదైనా జరిగితే వారి తల్లిదండ్రులకు ఆ బాధను తీర్చలేము గానీ నిందితులకు ఎలాంటి శిక్షలు వేస్తే ఆ తల్లిదండ్రులు శాంతిస్తారో అలాంటి శిక్షలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
రెండు బెత్తం దెబ్బలు చాలన్నవాడు.. అప్పుడు గన్ ఎందుకు పట్టుకొచ్చాడు.. పవన్ పై రోజా