జనసేన (Jana sena) చీఫ్ పవన్ కల్యాణ్ (pawan kalyan) దేశ రాజధాని ఢిల్లీ (delhi)కి పయనమయ్యారు. అక్కడ బీజేపీ (bjp) పెద్దలను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (andhra pradesh assembly elctions 2024)నేపథ్యంలో ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీడీపీ (TDP) ఎన్డీఏ (NDA)లో చేరుతుందా లేదా అనే విషయం కూడా ఈ సమావేశంలో ఓ కొలిక్కి రానుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు, సీట్ల సర్ధుబాటు అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ మరి కొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉండటంతో పొత్తుపై స్పష్టత తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

20 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. సన్యాసిగా మారి తల్లినే భిక్ష అడిగాడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన.. దాదాపు ఏడాది నుంచి టీడీపీని ఎన్డీఏలో చేర్చాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై పలుమార్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ బీజేపీ పెద్దలతో మాట్లాడారు. కానీ బీజేపీ నాయకులు పొత్తు విషయంపై ఎటూ తేల్చడం లేదు. ఇటు ఏపీలో జనసేన-టీడీపీ కలిసి పని చేస్తాయని, ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాయని గతంలోనే స్పష్టమైంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి.

ఇటీవల పవన్ కల్యాణ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుల మధ్య భేటీ జరిగింది. అయితే ఇందులో జనసేనకు 28 సీట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిందని, కానీ దానిని జనసేన తిరస్కరించిందని వార్తలు బయటకు వచ్చాయి. తమకు 40కి పైగా సీట్లు కావాలని పవన్ కల్యాణ్ పట్టుబట్టారని తెలిసింది. అయితే కాస్తా అటూ ఇటూ అయినా టీడీపీతోనే ఎన్నికలకు వెళ్తామని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని గతంలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ రెండు పార్టీల పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తాయని స్పష్టమైంది.

వామ్మో.. రూ.250 కోట్ల ఆస్తులు కూడబెట్టిన శివ బాలకృష్ణ.. ఇంతకీ ఎవరాయన ?

కాగా.. కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ చేరాలని టీడీపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. దీనికి పవన్ కల్యాణ్ సాయం కోరుతోంది. ఈ విషయంలో ఆయన కూడా ఏడాది కాలంగా బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే ఉద్దేశంతో మూడు పార్టీలు కలిస్తే బాగుంటుందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అందుకే మాజీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లి, తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

ఒక వేళ టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయిస్తే.. ఇదే సమావేశంలో సీట్ల సర్దుబాటుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి వస్తున్న నేపథ్యంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ స్థానాలను కూడా మూడు పార్టీలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ నిష్పత్తిలో సీట్లను షేర్ చేసుకోవాలనే దానిపై కూడా నేటి సమావేశం చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒక వేళ పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ఫలిస్తే మరో రెండు మూడు రోజుల్లో పొత్తుపై అధికార ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.