Bro: థియేటర్‌లో పాలాభిషేకంతో స్క్రీన్ పై పాలు.. చిరిగిపోయిన స్క్రీన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరెస్టు

బ్రో సినిమా విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకాలు మోడ్‌లోకి వచ్చారు. థియేటర్‌ల ముందు పండుగ చేసుకున్నారు. అయితే, ఏపీలోని పార్వతీపురంలోని థియేటర్‌లో ఈ వేడుక హద్దు మీరింది. అపశృతి చోటుచేసుకుంది. అభిమానులు థియేటర్‌లో స్క్రీన్ పై పాలాభిషేకం చేయడం, ఆ స్క్రీన్ చిరిగిపోవడంతో పోలీసులు కొందరు పవన్ ఫ్యాన్స్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
 

pawan kalyan fans pour milk on theatre screen, damaged, police arrested kms

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూసిన బ్రో సినిమా విడుదలైంది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల్లోని థియేటర్ల ముందు అభిమానుల కోలాహలం కనిపించింది. హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్‌లలో బ్యాండ్‌లతో సామూహికంగా డ్యాన్స్ చేశారు. ఒక రకమైన పూనకాలు కనిపించాయి. అయితే.. ఈ వేడుకల్లో ఓ అపశృతి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతిపురంలోని థియేటర్‌లో కొందరు అభిమానులు స్క్రీన్ పై కనిపించిన పవన్ కళ్యాణ్‌‌కు పాలాభిషేకం చేశారు. పాలను నేరుగా థియేటర్ స్క్రీన్ పై పోసేశారు. ఆ తర్వాత థియేటర్‌లో అంతా గందరగోళంగా మారింది. ఆ తర్వాత స్క్రీన్ చిరిగిపోయింది.

బ్రో సినిమాకు వచ్చిన కొందర పవన్ కళ్యాణ్ అభిమానులు పార్వతిపురంలోని థియేటర్‌లో స్క్రీన్‌కు పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత స్క్రీన్ చిరిగిపోయింది. దీంతో థియేటర్ యాజమాన్యం ఖంగారుపడింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు కేసు ఫైల్ చేశారు. పోలీసులు ఆ థియేటర్ వద్దకు చేరుకున్నారు. నిందితులను గుర్తించి జీపులో తీసుకెళ్లారు. దుస్తులు చినిగిపోయి ఉన్న కొందరిని పోలీసులు తీసుకెళ్లారు. 

Also Read: మణిపూర్ హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. ఎందుకంటే..: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

బ్రో సినిమాను సముత్తిరకని దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తోపాటు సాయి ధరమ్ తేజ్, ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ సహా పలువురు నటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios