విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.  ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్క్రిఫ్ట్‌తో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాజకీయ సినిమా చేస్తున్నారని, అజ్ఞాతవాసిలా పవన్‌ సినిమా ఫ్లాపవుతుందని ఆయన అన్నారు. 

 రాష్ట్రాభివృద్ధికి జగన్‌, పవన్‌, బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.వైసీపీతో బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో అందరూ ఉద్యమించాలని ఆయన పిలుపు ఇచ్చారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని, కేంద్రంపై మొదట తిరుగుబావుటా ఎగురవేసింది చంద్రబాబేనని ఆయన చెప్పారు.