హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అంటేనే మనకు గుర్తొచ్చే ఇమేజ్... యాంగ్రీ యంగ్ మ్యాన్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ చాలానే ప్రజా సమస్యలపై పోరాడాడు. ఆ పోరాటాలను ఎన్నికల్లో ఓట్ల రూపంలోకి మార్చడంలో విఫలమయ్యాడు. 

ఇలా మార్చుకోలేకపోవడం వల్ల తాను కూడా పోటీ చేసిన రెండు సీట్లలో సైతం ఓడిపోయాడు. ఓటమి చెందినప్పటికీ...ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటూ నిశ్చయించుకొని అలానే ప్రజా సమస్యలపై పోరాడడం నిజంగా రాజకీయంగా పవన్ కి కలిసివచ్చే అంశం. 

తాజాగా కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ... సభ్యసమాజం తలదించుకునే " **కొ*కా" అనే మాటను వాడాడు. అంతలా అమర్యాదకపూరితమైన మాటను ఒక వైసీపీ నేత ఉచ్చరించినప్పటికీ క్షమాపణ మాత్రం చెప్పకుండా... తన ఇంటిని ముట్టడించడానికి వచ్చిన విషయం పై ప్రెస్ మీట్ లో మాట్లాడడం నిజంగా బాధాకరం. 

Also read: పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

ఇప్పటివరకు కేవలం మంత్రి విశ్వరూపమ్ మాత్రమే ఈ విషయమై స్పందించి అలా మాట్లాడడం తప్పని ఆ మాటలను ఖండించారు. అంతే తప్ప వేరే పార్టీ నేతలెవ్వరూ కూడా స్పందించలేదు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కానీ, ఆ స్థాయి నేతలెవరూ కూడా నోరు మెదపకుండా ఉన్న వేళ ద్వారంపూడి ఇలా ప్రెస్ మీట్ పెట్టి కూడా క్షమాపణలు చెప్పకపోవడం నిజంగా శోచనీయం. 

ఇలా వైసీపీ సీనియర్లు మాట్లాడకపోవడాన్ని చూస్తుంటే... వైసీపీ అధినేత జగన్ దృష్టిలో పడాలంటే బూతులు మార్గమని ఎంచుకున్నారు అనే అనుమానం కలుగక మానదు. కోడలి నాని మాటలు వింటే అదే మనకు అర్థమవుతుంది.(కొద్దీ సేపు ఈ విషయాన్నీ పక్కకు పెడదాము)

ద్వారంపూడి తాజాగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని ఉద్దేశిస్తూ ఇంతటి అవమానకర బూతు మాటను మాట్లాడాడు. గతంలో శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ని మీ టూ ఉద్యమం సందర్భంగా వాడింది. శ్రీ రెడ్డి వేరే భాషలో తిట్టినప్పటికీ... భావం మాత్రం దాదాపుగా ఒక్కటే. 

Also read: మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

శ్రీ రెడ్డి అప్పట్లో కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమిస్తున్న సందర్భంలో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ..."మాద**ద్" అనే బూతు పదాన్ని ఉపయోగించింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ విషయమై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు.

అప్పట్లో మెగా ఫ్యామిలీలో మిగిలిన హీరోలు సైతం ఫిలిం ఛాంబర్ కి వచ్చారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కానీ  ఇంత జరిగినప్పటికీ కూడా శ్రీ రెడ్డి సారీ మాత్రం చెప్పలేదు. 

ఇప్పుడు ద్వారంపూడి సైతం పవన్ కళ్యాణ్ ను రాయడం వీలవని భాషలో తిట్టినప్పటికీ, ఆయన సైతం క్షమాపణ కొరకపోవడం విడ్డూరం. ఇక్కడ మరో ఇబ్బందికర సమస్య ఏమిటంటే చిరంజీవి ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. 

ఇలా పవన్ కళ్యాణ్ ని కావాలని టార్గెట్ చేసి రాజకీయాలు చేయడం ఎంత మాత్రం సబబు కాదు. ఆరోపణలు చేయడం, ప్రత్యారోపణలు చేయడం రాజకీయాల్లో సర్వ సాధారణమైన అంశం. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా పర్సనల్ గా మాత్రం రాజకీయ నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం శోచనీయం.