అకౌంట్ ను తనిఖీ చేసిన నిపుణులు అకౌంట్ హ్యాక్ అయినట్లు నిర్దారించారు. మరోవైపు ట్విట‍్టర్‌ హ్యాక్‌ అయిన విషయంపై పవన్‌  తన అభిమానులను అప్రమత్తం చేశారు.

హ్యాకర్లు ఎవ్వరినీ వదలటం లేదు. తాజాగా జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ట్వట్టర్ అకౌంట్ హ్యాక్ కలకలం రేపుతోంది. అకౌంట్ హ్యాక్ చేయటమే కాకుండా పాస్‌వర్డ్‌ కూడా మార్చేశారు. గత మూడు రోజుల నుంచి ట్విట్టర్‌ అకౌంట్‌ కు అంతరాయం ఏర్పడింది. ఏదో సాంకేతిక లోపం వల్లే అకౌంట్ తెరుచుకోవటం లేదనుకున్నారట పవన్. అయితే ఇవాళ ట్విట్టర్‌ అకౌంట్‌ పూర్తిగా స్తంభించడంతో అనుమానం వచ్చింది. వెంటనే ఐటీ నిపుణులతో సంప్రదించారట. అకౌంట్ ను తనిఖీ చేసిన నిపుణులు అకౌంట్ హ్యాక్ అయినట్లు నిర్దారించారు. మరోవైపు ట్విట‍్టర్‌ హ్యాక్‌ అయిన విషయంపై పవన్‌ తన అభిమానులను అప్రమత్తం చేశారు.