కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌కు సమీపంలో రోడ్డు బీటలు వారడం ఒక్కసారిగా సంచలనం కలిగించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు. ప్రజలకు మెరుగైన పాలన, సేవలు అందిస్తామని చెబుతూ.. ప్రశంసలు కురిపిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ పోలవరం రోడ్డు ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

‘‘కిలోమీటర్ మేరకు ఇంత దారుణంగా రోడ్డు దెబ్బతినడాన్ని రియల్ టైమ్ గ్రహించిందా..? కారణాలేంటో చెప్తారా..? లేదంటే పోలవరం సమీపంలో భూకంపం వచ్చిందని చెబుతారా.? ప్రజలను కన్‌ఫ్యూజన్‌లో పడేయకుండా.. కొంచెం క్లారిటీ ఇవ్వండి అంటూ పవన్.. ముఖ్యమంత్రిని కోరారు.

అలాగే చంద్రబాబు అఘాయిత్యాలను ప్రజలు భరించలేకుండా ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘‘ నోరు చేసే అఘాయిత్యాలను పొట్ట భరించలేదు’’ అనే చందంగా సీఎం వ్యవహారాలున్నాయని ఎద్దేవా చేశారు. అవకాశవాద రాజకీయాలతో..పూటకో మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగుచెంది ఉన్నారని.. వాటిని ఆపేయండి.. ప్రజలు ఇంకా భరించ లేకుండా ఉన్నారని సెటైర్లు వేశారు.