హోదా రాదని తెలిసిందో అప్పుడే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు ఆరంభించారు కదా. మరి అప్పట్లో పవన్ ఎందుకు ఆ విషయాన్ని పట్టంచుకోలేదో ఆయనే చెప్పాలి.

పవన్ కల్యాణ్ వ్యవహారం ‘ఉట్టకి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతాన’న్నట్లుగా ఉంది. ప్రత్యేకహోదా సాధన విషయంలోనే ఇంత వరకూ స్పష్టత లేదు. హోదా సాధించే విషయంలో ఎటువంటి మార్గాన్ని అనుసరించబోతున్నారో ప్రకటించలేదు. అటువంటిది తరచూ ధక్షిణ భారత దేశం గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకహోదా రాదన్న విషయం రాష్ట్ర ప్రజలకందరికీ ఎప్పుడో అర్ధమైనా పవన్ కు మాత్రం ఇప్పుడే తెలిసినట్లుంది. ఎప్పుడైతే హోదా రాదని తెలిసిందో అప్పుడే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు ఆరంభించారు కదా. మరి అప్పట్లో పవన్ ఎందుకు ఆ విషయాన్ని పట్టంచుకోలేదో ఆయనే చెప్పాలి.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళయిపోయింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుండి హోదా విషయంలో గందరగోళం జరుగుతూనే ఉంది. అంటే పవన్ కు జ్ఞానోదయం అయ్యేనాటికే హోదా అంశాన్ని రెండు ప్రభుత్వాలూ కలిసి విజయవంతంగా కోల్డ్ స్టోరేజీలోకి నెట్టేసాయి. దాదాపు కోమాస్టేజ్ లోకి వెళ్లిపోయిన అంశంపై పవన్ ఇపుడు కొత్తగా ఉద్యమం చేస్తాననటం విశేషం. సరే, పవన్ ఉద్యమం వల్లనైనా కేంద్రం కళ్ళు తెరిచి రాష్ట్రానికి హోదా ఇస్తే సంతోషమే.

అయితే, ఇక్కడే సమస్య తలెత్తుతోంది. పవన్ తన ఉద్యమాన్ని ఏపికి మాత్రమే పరిమితం చేయకుండా మొత్తం ధక్షిణ భారత దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. ధక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కూడా పవన్ అవసరం ఏమాత్రం లేదు. పవన్ వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తారన్న నమ్మకం కూడా ఇక్కడ చాలామందికి లేదు. కాకపోతే, పోయిన ఎన్నికల్లో భాజపా, టిడిపిలకు మద్దతుగా నిలిచారు కాబట్టి, ప్రశ్నించటానికే తన పార్టీ పుట్టిందని చెప్పుకున్నారు కాబట్టి కనీసం కొందరైనా హొదా విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలని కోరుకున్నారు.

మరి ఇటువంటి పరిస్ధితుల్లో తన రాజకీయ వ్యూహాలను పవన్ ఎంత జాగ్రత్తగా రచించుకోవాలి? వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ఎక్కడా కనబడటం లేదు. ఎందుకంటే ఎక్కువ కాలం షూటింగ్ ల్లోనే గడిపుతున్నారు. ఎప్పుడో ఒక్కసారి ట్విట్టర్లో కనబడతారు. చాలా అరుదుగా మాత్రమే జనాల్లోకి వస్తున్నారు. అందుకే పవన్ను పార్ట్ టైం పొలిటీషీయన్ అని ఎద్దేవా చేస్తున్నారు. తాను రాజకీయాలను సీనియస్ గానే తీసుకున్నట్లైతే అవలంభించాల్సిన విధానం మాత్రం ఖచ్చితంగా ఇది కాదు.