ఎవరు ఒత్తిడి పెడుతున్నారు ?

ఎవరు ఒత్తిడి పెడుతున్నారు ?

తానేం మాట్లాడుతున్నాడో పవన్ కల్యాణ్ కు అర్ధమవుతున్నట్లు లేదు. శనివారం అనంతరపురం జిల్లాతో ‘చలొరే చలొరే చల్’ కార్యక్రమంలో భాగంగా రాయలసీమ యాత్రను పవన్ ఆరంభించారు. జనసేన పార్టీ కార్యాలయానికి గుత్తి రోడ్డులో భూమిపూజ చేసిన తర్వాత ప్రజలను, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకదానికి ఒకటి పొంతనలేని మాటలన్నీ మాట్లాడారు. ‘తనపై నమ్మకముంటేనే తనకు ఒట్లు వేయండి’ అన్నారు. ఓట్లు వేసినా వేయకపోయినా రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించటం గమనార్హం.

సమస్యల పరిష్కారిని తప్పదనుకుంటేనే తాను రోడ్లపైకి వస్తానని చెప్పారు. అంటే పవన్ ఉద్దేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఏ సమస్యా ఉన్నట్లు లేదు. పోరాటాలు చేసి ప్రజల సమయాన్ని వృధా చేయదలచుకోలేదట. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయటానికి రాజకీయ పార్టీలుంటాయన్నారు. మరి జనసేన రాజకీయ పార్టీ కాదా? తనపై ఎంతమంది దాడిచేసినా భయపడరట. అసలు పవన్ పై ఎవరు దాడి చేయలేదే? తనపై ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, జైల్లో పెట్టినా వెనకాడరట. పవన్ పై ఎవరు ఒత్తిళ్ళు పెడుతున్నారు? ఎందుకు జైల్లో పెడతారో అర్దం కావటం లేదు. రెండు రాష్ట్రాల్లోని అధికారపార్టీలతో అంట కాగుతున్నపుడు ఇక పవన్ ను ఎవరు జైల్లో పెడతారు ?

తాను ఎవరికీ తొత్తులా వ్యవహరించడంలేదని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సిద్ధాంతాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని, అంశాలను బట్టి మద్దతు ఇస్తానని తెలిపారు. ‘‘కరువు సమస్యలపై అధ్యయనం చేస్తా. పరిష్కారాల కోసం కేసీఆర్‌, చంద్రబాబులను కలుస్తా. నేను ఎవరికీ తొత్తునుకాను. రాజకీయాల్లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. అంశాలను బట్టి మద్దతు ఇస్తాన్నారు.

రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతా అని చెప్సారు. సీమ సమస్యలపై ఓ బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలుస్తానని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.. ఓటు బ్యాంకు రాజకీయాలకు తానుదూరమన్నారు. నా పని నచ్చితేనే ఓటువేయమని అడుగుతా అని చెప్పారు. మూడు రోజుల విరామం తర్వాత నేడు అనంతకు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. తర్వాత సీమ కరువుపై కొందరు ముఖ్యులతో ఇష్టాగోష్టి నిర్వహించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos