మీకు వోట్లేసి గెలిపించిన పశ్చిమ గోదావరి ప్రజలును ఎలా ఆదుకుంటారో , మీ ఇష్టం. అదుకోవాలంతే...

చేజారితే మెగాఅక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తుందుర్రు కూడా పశ్చిమబెంగాల్ నందిగ్రాం అయిపోయే ప్రమాదం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ రోజు మొగల్తూరు అక్వాఫుడ్ ప్యాక్టరీలోఅమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్ల అయిదు గురు మరణించడంమీద ఆయన అభిప్రాయాలను ట్విట్టర్ పెట్టారు. ఈ సందర్భంగా ‘ ప్రభుత్వం తుందుర్రు మెగా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారుల నిరసనను అర్థంచేసుకోవాలి. వారి మీద దుందుడుకుగా ప్రవర్తిస్తే నందిగ్రామ్ తరహా హింస చెలరేగే ప్రమాదం ఉంది. నిన్న మొగల్తూరు లో జరిగిన ప్రమాదం తుందుర్రు ప్రజల ఆందోళనలో వాస్తవముందని రుజువు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

‘అనంద అక్వాఫుడ్ పార్క్ బాదితులు న్యాయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ప్రమాదాల మీద నిర్లక్ష్యం వైఖరి వహించినందుకు ఫ్యాక్టరీ మనేజ్మెంట్ మీద కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు.’ అని ఆయన ట్విట్టర్ అభిప్రాయపడ్డారు.

‘ఇలాంటి సంఘటనే ఇదే ఫ్యాక్టరీలోనే 2012లో కూడా జరిగిందని, మరణాలు సంభవించినాయని నాకు సమాచారం అందించారు.దాని మీదకూ డా పోలీసులకు,అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.అయినా ఎలాంటి చర్య తీసుకోలేదు.’ అని అన్నారు.

గోదావరిలో కి కలుషితాలను విడుదల చేస్తున్న ఫ్యాక్టరీల వ్యవహారాన్ని పరశీలించాలని ప్రభుత్తం మీద వత్తడి తీసుకురావాలని చాలా మంది పర్యావరణ వేత్తలు జనసేనను కలిశారు.ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్రానికి అన్నపూర్ణ వంటివి. అక్వా పరిశ్రము గోదావరి నదికి ఎంత గా కలుషితం చేస్తున్నాయో అధ్యయనం చేసేందుకు పర్యావరణ వేత్తలు ముందుకు వస్తే వారితో కలసి పని చేసేందుకు, నియమాలను కచ్చితంగా ఈ ఫ్యాక్టరీలు ల అమలు చేసేలా వత్తిడి తీసుకువచ్చేందుకు జనసేన సిద్ధమని కూడా పవన్ చెప్పారు.

‘గత ఎన్నికలలో అనేన నియోజకవర్గాలలో గెలిచేందుకు మద్దుతు నిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎలా అండగా నిలవాలనేది రాజకీయంగా పాలనా పరంగా బాగా అనుభవం ఉన్న తెలుగుదేశం పరిధిలోనే ఉంది.’ అని పవన్ అన్నారు.