మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పులు లెక్క పెట్టినట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యర్ధుల తప్పులు లెక్క పెడుతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. శనివారం ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ జారీ చేసిన ప్రెస్ రిలీజ్ లో అదే విషయాన్ని ప్రస్తావించారు. ‘మనపై చేస్తున్న ప్రతీ కువిమర్శను పార్టీ లెక్కపెడుతూనే ఉంద’న్నారు.
మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పులు లెక్క పెట్టినట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యర్ధుల తప్పులు లెక్క పెడుతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. శనివారం ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ జారీ చేసిన ప్రెస్ రిలీజ్ లో అదే విషయాన్ని ప్రస్తావించారు. ‘మనపై చేస్తున్న ప్రతీ కువిమర్శను పార్టీ లెక్కపెడుతూనే ఉంద’న్నారు. అవి హద్దులు మీరుతున్నపుడు సమయం, సందర్భం చూసుకుని పార్టీ స్పందిస్తుందని పవన్ స్పష్టం చేసారు. అంతవరకూ మీరు ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్ళండి’ అంటూ జనసైనికులకు(?) దిశానిర్దేశం చేసారు.
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా మనం ముందుకు సాగాలన్నారు. ‘కొందరు పేరు కోసమో లేకపోతె మన దృష్టి మరల్చటం కోసమో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటార’ని పవన్ హెచ్చరించారు. అటువంటి వారు ఏమన్నా జనసైనికులు స్పందించవద్దని తెలిపారు. తనపై వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడినా మనం మాత్రం హుందాగానే ఉండాలన్నారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జనసేన భిన్నమైన రాజకీయాలు చేస్తుందన్న విషయాన్ని ప్రతీ ఒక్కళ్ళూ గుర్తుంచుకోవాలంటూ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఇటువంటి నేపధ్యంలో ఎవరో ఏదో అన్నారని జనసైనికులు స్పందిస్తే పార్టీకి మేలు చేయకపోతే నష్టం జరుగుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.
