టిడిపి-వైసిపి రెండు దొంగలేనా ?

టిడిపి-వైసిపి రెండు దొంగలేనా ?

అధికార, ప్రతిపక్షాల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తల సమావేశంలో బుధవారం పవన్ మాట్లాడారు. తెల్లవారి లేస్తే మీరు దోచుకున్నారని టిడిపి, కాదు మీరే దోచుకుంటున్నారంటూ వైసిపి చేస్తున్న ఆరోపణలతో ఇద్దరూ దొంగలేనా అన్న అనుమానం వస్తోందన్నారు. అధికార-ప్రతిపక్షాలు చెరో లక్ష కోట్లు దోచుకుంటే ఇక ప్రజలకేం చేస్తాయని ప్రశ్నించారు. వీళ్ళద్దరి దోపిడిలో నలిగిపోతున్నది సామాన్య ప్రజలే అంటూ పవన్ వాపోయారు. అదే సమయంలో యువత అంటే కేవలం జగన్ , లోకేషే కాదన్నారు. యువతంటే జనమని స్పష్టంగా చెప్పారు. 

పనిలో పనిగా వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకు వైరం ఏమీ లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. జగన్ తనకు శతృవేమీ కాదన్నారు. కాబట్టే జగన్ తో తనకు వైరం ఏమీ లేదన్నారు. అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ ఎన్నో మంచి పనులు చేసారని అదే సమయంలో అవినీతి కూడా జరిగిందన్నారు. వైఎస్ చనిపోగానే సిఎం అవ్వాలనుకోవటం జగన్ అవివేకమని వ్యాఖ్యానించారు. అందుకే తాను జగన్ కు మద్దతు ఇవ్వలేదన్నారు.

ఇక, తన సోదరుడు చిరంజీవి గురించి మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీని దెబ్బ కొట్టిన వాళ్ళను ఎవరినీ తాను మరచిపోనన్నారు. మహానుభావుడైన చిరంజీవిని కూడా కొందరు స్వార్దపరులు తమ అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపించారు. అప్పట్లో పిఆర్పిలో ఉన్న పరకాల ప్రభాకర్ గురించి సమయం వచ్చినపుడు చెబుతానని అన్నారు. మొత్తం మీద దాదాపు రెండు గంటల పాటు అనేక విషయాలపై పవన్ సుదీర్ఘంగా మాట్లాడారు. తనలోని ఆవేశాన్ని, ఆలోచనలను కార్తకర్తలతో పంచుకున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page