డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటేజేషన్ కు వ్యతరేకంగా ఏపి పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటేజేషన్ కు వ్యతరేకంగా ఏపి పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ సూచించటం గమనార్హం.

Scroll to load tweet…

లాభాల్లో ఉన్న డిసిఐని ప్రైవేటీకరించటం సరికాదంటూ ఆమధ్య పవన్ విశాఖపట్నంలో హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. డిసిఐని ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకిస్తూ పవన్ ఓ సభ నిర్వహించటమే కాకుండా ప్రధానికి ఓ లేఖ కూడా రాసారు లేండి.

Scroll to load tweet…

ఇపుడు ఆ విషయం మీదే ట్విట్టర్లో స్పందించారు. నష్టాల్లో ఉన్న సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని పవన్ ట్విట్టర్లో ప్రస్తావించారు. నష్టాల్లో ఉన్న సంస్ధనే ప్రైవేటీకరించవద్దని ముఖ్యమంత్రి లేఖ రాసినపుడు లాభాల్లో ఉన్న డిసిఐని ప్రైవేటీకరించటంలో అర్ధం లేదన్నది పవన్ వాదన. కాబట్టి డిసిఐ విషయంపై వెంటనే ఏపి ఎంపిలు ప్రధానిని కలిసి ఒప్పించాలంటూ పవన్ గట్టిగా కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపుడుకునే విషయంలో తమిళనాడు నేతలు ఏకతాటిపై నిలబడినపుడు అదే స్పూర్తి ఏపి నేతల్లో ఎందుకు కొరవడిందని పవన్ ప్రశ్నించారు.