జగన్ పాదయాత్రలో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు

First Published 11, Jun 2018, 7:37 AM IST
Pawan and Balakrishna flexies in Jagan Padayatra
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో విచిత్రంగా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి.

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో విచిత్రంగా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఈ జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

కాగా, చంద్రవరంలో బాలకృష్ణ, జగన్ ఫోటోలు పెట్టి వీరిద్దరి మధ్యలో మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలో జగన్ చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు. బాలయ్య మీసాన్ని మెలేస్తున్న ఫొటోను పెట్టారు. 

"పవన్ అంటే ప్రాణమిస్తాం... జగన్ అంటే ప్రేమిస్తాం" అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. జగన్ మరో రెండు రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని, రాజమండ్రి వంతెన మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తారు

loader