ఆగస్టు 2వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ  తిరుమలలో  ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్పలిస్తున్నాయన్న జేఈవో  


తిరుమలలో వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలకు ఆగస్టు 3 నుండి 5 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆగస్టు 2వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరపనున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. దీని కోసం దేవాలయ అదికారులు అప్రమత్తం కావాలని, భక్తులకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ..తిరుమలలో ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్పలితాలనిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే భక్తులకు గదులు కేటాయించే అంశంలో నూతన విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలియజేసారు. దీని వల్ల భక్తులకు ఇబ్బందుల తొలగిపోయాయన్నారు. అలాగే నడకదారి టోకెన్లలో టైం స్లాట్ విధానాన్ని అవలంభించడం వల్ల భక్తులు క్యూలైన్లలో వేచివుండాల్సిన శ్రమను తగ్గించామన్నారు. దీనికి భక్తుల్లో నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. దీనివల్ల నడకదారి భక్తులు గంటలోపే స్వామి వారిని దర్శించుకుంటున్నారని జేఈవో తెలిపారు.
 క్యూలైన్లలో తెచ్చిన మార్పుల వల్ల కూడా తోపులాటలు నివారించగలిగామని,అందువల్ల భక్తులు శ్రీవారిని గందరగోళం లేకుండా ప్రశాంతంగా దర్శించుకుంటున్నారని జేఈవో తెలిపారు.