Asianet News TeluguAsianet News Telugu

పాతపట్నం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఉత్తరాంధ్రలోని మరో నియోజకవర్గం పాతపట్నం. ఇక్కడ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసిపిదే విజయం. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని వైసిపి పోటీలో పెట్టింది. ఇక టిడిపి మామిడి గోవిందరాజును బరిలో నిలిపింది. 

Pathapatnam assembly elections result 2024 AKP
Author
First Published Mar 28, 2024, 8:29 PM IST

పాతపట్నం నియోజకవర్గ రాజకీయాలు :
 
ఉమ్మడి రాష్ట విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాల్లో పాతపట్నం ఒకటి.  2‌014లో శత్రుచర్ల విజయరామరాజు, 2019లో కలమట వెంకటరమణ మూర్తి పాతపట్నంలో పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది టిడిపి. 

ఇక వైసిపి వరుసగా రెండు ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రెడ్డి శాంతి ని మరోసారి బరిలోకి దించారు. పాతపట్నం అసెంబ్లీ చరిత్రలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడినుండి లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అదికూడా ఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైసిపిలో కొనసాగుతున్నారు. 

పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. పాతపట్నం
2. మెళియాపుట్టి
3.  కొత్తూరు
4.  ఎల్ ఎన్ పేట
5. హిరమండలం

పాతపట్నం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,17,897
పురుషులు -    1,10,246
మహిళలు ‌-     1,07,634

పాతపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతినే మరోసారి పాతపట్నం పోటీలో నిలిపారు వైసిసి అధినేత వైఎస్ జగన్. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ కొత్తగా మామిడి గోవిందరావును పాతపట్నం బరిలో నిలిపింది. 

పాతపట్నం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పాతపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,47,647 (72 శాతం) 

వైసిపి - రెడ్డి శాంతి - 76,941 ఓట్లు (50 శాతం) - 1,702 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - కలమట వెంకట రమణమూర్తి - 61,390 ఓట్లు (40 శాతం) - ఓటమి

పాతపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,41,038 ఓట్లు (73 శాతం)

వైసిపి - కలమట వెంకట రమణమూర్తి - 69,320 (49 శాతం) - 3,865 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - శత్రుచర్ల విజయరామరాజు - 65,455 (46 శాతం) - ఓటమి

Follow Us:
Download App:
  • android
  • ios