కోనసీమ జిల్లాలో స్టీరింగ్ పై పాము: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
కోనసీమ జిల్లాలోని గాడిలంకలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు.
కాకినాడ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గాడిలంకలో మంగళవారంనాడు పెద్ద ప్రమాదం తప్పింది. కారు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లింది. కారు స్టీరింగ్ పై పాము కన్పించడంతో డ్రైవర్ స్టీరింగ్ ను వదిలేశాడు. దీంతో కారు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పొలాల్లోకి వెళ్లిన కారును బయటకు తీశారు. అయితే ఈ కారులోని ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి.
గతంలో కూడ అదుపు తప్పి కారు పొలాల్లోకి వెళ్లిన ఘటనలు కూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. 2022 ఏప్రిల్ 03వ తేదీన చిత్తూరు జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఒడిశా నుండి వరరామచంద్రాపురం కారులో ఐదుగురు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా కల్లేరు వద్ద కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందారు.
మరో వైపు పాలకొండ నుండి పార్వతీపురం వెళ్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు విద్యార్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన 2021 జూలై 5వ తేదీన జరిగింది.
2020 అక్టోబర్ 5వ తేదీన నంద్యాల- ఆళ్లగడ్డ రోడ్డు మార్గంలో కారు ప్రమాదం జరిగింది. దిబగుంట్ల మెట్ట వద్ద బైక్ ను ఢీకొట్టి కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.