పవన్ కల్యాణ్ కు పరిటాల సునీత భలే సలహా

First Published 3, Jun 2018, 8:45 PM IST
Paritala Sunitha gives suggestion to Pawan Kalyan
Highlights

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత భలే సలహా ఇచ్చారు.

గుంటూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత భలే సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ ది యువరక్తమని, యాత్రల పేరుతో సమయం వృధా చేసుకోవద్దని ఆమె అన్నారు. 

తమతో కలిసి పవన్ కల్యాణ్ నడిస్తే బాగుంటుందని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు అధికారం రావడం కల్ల అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ను ప్రజలు విశ్వసించబోరని అన్నారు.

loader