Asianet News TeluguAsianet News Telugu

కరోనా బారిన పడి పరిగి ఏఎస్సై మృతి, క్వారంటైన్ కి కుటుంబ సభ్యులు

విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా పరిగిలో ఏఎస్సై గా పనిచేస్తున్న హబీబుల్లా కరోనా వైరస్ సోకడం వల్ల మరణించాడు. 

Parigi ASI dies from Coronavirus
Author
Anantapur, First Published Apr 20, 2020, 2:52 AM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న వేళ.... భారతదేశం లాక్ డౌన్ మార్గాన్ని ఎంచుకొని మే 3వ తేదీ వరకు అదే స్థితిలో కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇలా లాక్ డౌన్ కాలంలో ఈ కరోనా పై పోరులో మనమంతా ఇండ్లకే పరిమితమై ఉంటె... పోలీసులు, డాక్టర్లు మొదలైన సిబ్బంది అంతా ఈ కరోనా బారినుండి మనల్ని కాపాడడానికి వారు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. 

తాజాగా ఇలా విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా పరిగిలో ఏఎస్సై గా పనిచేస్తున్న హబీబుల్లా కరోనా వైరస్ సోకడం వల్ల మరణించాడు. 

గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హబీబుల్లాను రెండు రోజుల క్రితం మరణించాడు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో హబీబుల్లాకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఇక పోతే ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతోపాటుగా హబీబుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. 

ఇకపోతే దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రంగాలకు ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు.

Also Read:విజృంభిస్తున్న కరోనా: ఇకపై గ్యాస్ నో డోర్ డెలివరీ.. మరి ఎలాగంటే..?

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల సడలింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

Aslo Read:కరోనా: ఇండియాలో 24 గంటల్లో 1,334 కేసులు, మొత్తం 15,712కి చేరిక

దీని ప్రకారం.. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ అధికారులు, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపింది. 

మినహాయింపులు వర్తించేది వీటికే:

* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, రైస్, పప్పు మిల్లులు, పిండి మరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు
* ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు. శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్‌ కంపెనీలు.
* ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలు కొనసాగింపు

అయితే రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తించవు.

Follow Us:
Download App:
  • android
  • ios