Asianet News TeluguAsianet News Telugu

కూతురి ఎంబీబీఎస్ ఫీజు.. కిడ్నీలు అమ్ముకుంటాం అనుమతినివ్వండి..

అనంతపురంలో హృదయాల్ని మెలిపెట్టే ఘటన చోటు చేసుకుంది. కుమార్తె ఎంబీబీఎస్ పరీక్ష ఫీజు కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు ఓ తల్లిదండ్రులు. దీనికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు.

parents seeks permission to sell kidney to pay daughters mbbs exam fee - bsb
Author
Hyderabad, First Published Apr 14, 2021, 3:34 PM IST

అనంతపురంలో హృదయాల్ని మెలిపెట్టే ఘటన చోటు చేసుకుంది. కుమార్తె ఎంబీబీఎస్ పరీక్ష ఫీజు కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు ఓ తల్లిదండ్రులు. దీనికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు.

కన్నీరు తెప్పించే ఈ ఘటన వివరాల్లోకి వెడితే అనంతపురం జిల్లా, హిందూపురానికి చెందిన మక్బుల్ జాన్, ఆయూబ్ ఖాన్ దంపతులు తమ కుమార్తెకు ఎంబీబీఎస్ పరీక్ష ఫీజు కట్టడానికి తమ వద్ద డబ్బులు లేవని, అందుకే కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నారు.

వీరి కుమార్తె రుబియా ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే విదేశీ ఉన్నత విద్య స్కాలర్ షిప్ మంజూరు కాలేదని, దానికోసం రెండు నెలలుగా ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని ఆ దంపతులు వాపోయారు. 

ఈ నెల 17వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండటంతో కిడ్నీలు అమ్మకానికి అనుమతించాలని రుబియా తల్లిదండ్రులు కలెక్టర్ ను వేడుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios