జరుగుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించటం పన్నీర్ కు అంత వీజీ కాదన్న విషయం అర్ధమైపోయింది.
శశికళ వర్గం ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పార్టీ నుండి బహిష్కరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రింకోర్టు శశికళకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 కోట్లు జరిమానా విధించింది. దాని తర్వాత కొన్ని కీలకమైన మార్పలు చోటు చేసుకున్నాయి. కోర్టు తీర్పుతో శశికళకు ముఖ్యమంత్రి పదవి యోగ శాస్వతంగా దూరమైపోయింది. దాంతో శశికళ స్ధానంలో సీనియర్ ఎంఎల్ఏ పళనిస్వామిని కొత్త నేతగా మిగిలిన ఎంఎల్ఏలు ఎన్నుకున్నారు. వెంటనే పన్నీర్ సెల్వంను పార్టీ నుండి బహిష్కరించాలని కూడా ఎంఎల్ఏలు ఏకగీవ్రంగా నిర్ణయించటం గమనార్హం.
జరుగుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించటం పన్నీర్ కు అంత వీజీ కాదన్న విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే, ఉదయం పదకొండు గంటలకు కోర్టు శశికళకు శిక్ష ఖరారు చేసినా ఇంతవరకూ చిన్నమ్మ శిబిరంలో నుండి ఒక్క ఎంఎల్ఏ కూడా పన్నీర్ కు మద్దతు పలకలేదు. పైగా ఇంకా తామంతా శశికళ వేంటే ఉన్నట్లు చెబుతున్నారు. దానికితోడు పళనిస్వామి కూడా బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ ను కోరటం విశేషం. జరుగుతున్న పరిణామాలను బట్టి అసలైన రాజకీయానికి ఇపుడే తెరలేచినట్లు అర్ధమవుతోంది.
