Asianet News TeluguAsianet News Telugu

రోజాకి ఆ బిల్డింగ్ పై నుండి దూకే ధైర్యం ఉందా?: అనురాధ సవాల్

 ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుజుకోవడం కోసమే ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి అమరావతి విషయం తెరపైకి తీసుకొస్తున్నారని టిడిపి నాయకురాలు అనురాధ మండిపడ్డారు.

panchumarthi anuradha challenge to ycp mla roja
Author
Vijayawada, First Published Sep 17, 2020, 8:06 PM IST

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోందని...ఈ కాలంలో సంపద సృష్టించి ప్రజలను ఆర్ధికంగా ఉద్దారించాల్సిందిపోయి పన్నులు భారం వేసి ఆర్ధికంగా నష్టపోయే విధంగా ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. 

''పెట్రోలు, డీజీల్ పై రెండు విడతల్లో రూ.4 పెంచారు. ఇప్పుడు మూడో సారి కూడా పెంచి ప్రజలపై పన్ను భారం మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా పరిపాలన అంటే'' అని అనురాధ విమర్శించారు. 

''పన్నులతో పాటు ఆర్టీసీ, విద్యుత్త్, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇసుక రేట్లు పెంచి దాదాపు 65వేల కోట్ల పన్ను భారం మోపారు. దాదాపు  రూ.లక్షా 12వేల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వం చేసిన అప్పుల వలన రాష్ట్రంలో ప్రతి కుటుంబపై రూ.80వేల పన్ను భారం మోపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చేది రూ.10 అయితే నెత్తి మీద వేసింది రూ.50'' అని ఆరోపించారు. 

ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుజుకోవడం కోసమే ప్రతి ఆరు నెలల కొక్కసారి అమరావతి విషయం తెరపైకి తీసుకొస్తున్నారని అనురాధ మండిపడ్డారు. అమరావతి విషయంలో ఎమ్మెల్యే రోజా రోజుకో మాట నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో రోజా అమరాతి గురించి ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలని... రాజధాని కొనసాగుతుంది కాబట్టే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని అన్నలేదా? అని నిలదీశారు. ఇప్పుడు అదే నోటితో అమరావతిని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. 

టిడిపి హయాంలోని సెక్యూరిటీ అధికారులు...సింహాలను అప్పగించలేదు: దుర్గగుడి ఛైర్మన్

ఏపీఐఐసీ ఛైర్మన్ గా వ్యవహారిస్తున్న రోజా రాజధాని లో చంద్రబాబు కట్టించిన  బిల్లింగ్స్ ను  గ్రాఫిక్స్  అంటున్నారని... ధైర్యం ఉంటే ఏపీఐఐసీ బిల్డింగ్స్ పై నుంచి దూకి అది గ్రాఫిక్స్ అని నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గా రోజా విఫలమయ్యారని అన్నారు. అమరావతి లో కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్న రోజా తన నియోజకవర్గంలో వాడమాడపేటలో 300 ఎకరాల కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడం లేదు? ఆమెకు వ్యతిరేకంగా దళితులు ధర్నా చేసిన మాట వాస్తవం కాదా?'' అని ప్రశ్నించారు. 

తానేమీ ఎస్సీ, ఎస్టీని కాదు మీరు దగ్గరకు రావచ్చని పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? అన్నారు. ఉల్లిపాయల కోసం రైతు చనిపోతే దాని గురించి చంద్రబాబునాయుడు  మాట్లాడితే మీరు ఉల్లిపాయ తినకపోతే చంచిపోతారా అని మాట్లాడారు. రోజా భాష కరెక్ట్ కాదు. ప్రజాసేవ చేయాలనే కోరిక మీద రాజకీయాల్లోకి వచ్చి పంచాయితీ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రి గా రాష్ట్రానికి 800 అవార్డులు తీసుకొచ్చిన నారా లోకేష్ ని విమర్శిస్తారా? 16నెలలు జైలులో ఉండి వచ్చిన వ్యక్తిని మాత్రమే గుర్తుస్తారా? అని అనురాధ  విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios