ఆపరేషన్ గరుడ: "చంద్రబాబు డైరెక్షన్, హీరో శివాజీ యాక్షన్"

Operation Garuda: IYR Krishna Rao comments on Chandrababu
Highlights

హీరో శివాజీ తెర మీదికి తెచ్చిన ఆపరేషన్ గరుడపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. 

హైదరాబాద్‌: హీరో శివాజీ తెర మీదికి తెచ్చిన ఆపరేషన్ గరుడపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.  ఆపరేషన్‌ గరుడకు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడే దర్శక,నిర్మాత, రచయిత అని ఆయన వ్యాఖ్యానించారు. 
చంద్రబాబు తాను రాసుకున్న స్క్రిప్టును నటుడు శివాజీతో చెప్పించి, ఆపై 'ఆపరేషన్ గరుడ నిజం కావచ్చునని దీర్ఘాలు తీయడం కుట్రలో భాగమేనని ఆయన ట్విటర్ లో కామెంట్ చేశారు. 

"ఆపరేషన్‌ గరుడ నిజమవుతుందనిఅన్న మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా? తాను రాసిన స్క్రిప్టును నటుడు శివాజీతో పలికించి, ఇప్పుడేమో నవనిర్మాణ దీక్షలో అదే నిజమవుతుంది.. అనడంలో అంతరార్థం ఏమిటి?" అని ప్రశ్నించారు. 

"ఆపరేషన్ గరుడ కు తమరే(చంద్రబాబే) నిర్మాత దర్శకులు రచయిత. ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈ రోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా సర్‌జీ!! సాబ్జీ" ఐవైఆర్ అన్నారు. 

loader